నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెడుతున్నాం
నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెడుతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలిపారు.
- నక్సల్స్ రహిత ప్రాంతంగా బస్తర్
- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెడుతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలిపారు. సోమవారం ఛత్తీస్గఢ్లో పర్యటించిన అమిత్షా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీసు అధికారులను సోమవారం జగదల్పూర్లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పష్టమైన ప్రణాళిక, పకా వ్యూహంతో ముందుకు సాగినట్టు చెప్పారు. బస్తర్ ప్రాంతాన్ని నక్సల్స్ రహితంగా ప్రకటించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. తెలంగాణలో నక్సలిజాన్ని సమూలంగా అణచివేసిన పోలీస్ ఉన్నతాధికారులను అభినందించి, సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ బీ శివధర్రెడ్డి, ఆపరేషన్స్, ఆక్టోపస్ అండ్ గ్రేహౌండ్స్ డీజీ అనిల్ కుమార్, మలాజ్గిరి కమిషనర్, ఎస్ఐబీ మాజీ ఐజీ సుమతితో పాటు ఆమె నేతృత్వంలోని ఎస్ఐబీ బృందం ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

