కరీంనగర్ విద్యానగర్, జూలై 27: కాంగ్రె స్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కేంద్ర ప్రభుత్వం పై నిందలు వేస్తున్నదని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించా రు. శనివారం కరీంనగర్‌లోని వీ పారులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.లక్షా తొమ్మిది వేల కోట్లకు పైగా నిధులను కేంద్రమే సమకూరుస్తుందని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించారని, మరి పైసా లేదని తీర్మానం ఎట్లా చే స్తారని మండిపడ్డారు. అసెంబ్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం దుర్మార్గమని విమర్శించారు. జీఎస్టీ ఆదాయంలో 74 శాతం సొమ్ము తిరిగి రాష్ట్రానికే ఇస్తుందని, గతంలో 32 శాతం ఉన్న డీ వ్యాల్యూషన్ ఫండ్‌ను 42 శాతానికి పెంచామని గు ర్తుచేశారు. ఆరు గ్యారెంటీలపై ఊసేదని ప్ర శ్నించారు. కాంగ్రెస్ 420 హామీలకు బడ్జెట్లో నిధులు ఎందుకు ప్రతిపాదించలేదని నిలదీశారు. రుణమాఫీకి రూ.35 వేల కోట్లు అవసరమని కాంగ్రెస్ వాళ్లే చెప్పారని, బడ్జెట్లో మాత్రం రూ.15 వేల కోట్లే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. రైతు భరోసాపై క్లారిటీ లేదని చెప్పారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, రాణి రుద్రమదేవి తదితరులు పాల్గొన్నారు.