తెలంగాణ సొమ్ము ఢిల్లీకి
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకున్నదని, ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి తరలిస్తున్నాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు.
- ఆర్ఆర్ ట్యాక్స్‌ను తరలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- కాంగ్రెస్‌కు ఏటీఎంలా తెలంగాణ
- ఆ పార్టీకి సర్జికల్‌స్ట్రైక్స్ చేసే ధైర్యం లేదు
- కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ ట్రిపుల్ తలాక్
- ‘ఇండియా’ గెలిస్తే ఏడాదికో ప్రధాని
- వికారాబాద్, వనపర్తి సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
వికారాబాద్/వనపర్తి, మే 11, (నమస్తే తెలంగాణ) : తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకున్నదని, ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి తరలిస్తున్నాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. వికారాబాద్, వనపర్తి జిల్లా కేంద్రాల్లో శనివారం నిర్వహించిన జనసభల్లో ఆయన మాట్లాడుతూ ఇండి యా కూటమి అధికారంలోకొస్తే ప్రధాని శరద్‌పవార్ అవుతారా? లేక మమతబెనర్జీ యా?, స్టాలినా?, ఉద్ధవ్ఠాక్రేనా? లేక రాహుల్‌గాంధీయా? అని ఎద్దేవా చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఇండియా కూటమి గెలిస్తే ప్రధాని ఎవరవుతారని రాహుల్‌గాంధీని అడిగితే ఏడాదికొకరు ప్రధానిగా పనిచేస్తారని చెప్పారని, ఏడాదికో ప్రధాని అయితే అత్యవసర సమయాల్లో దేశాన్ని ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు.
తన ఫేక్ వీడియో షేరింగ్‌పై స్పందిస్తూ తాము అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో కాకులను కూడా చంపలేదన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులను అంతమొందించామని, సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్‌కు లేదని, ఉగ్రవాదులను కాంగ్రెస్ పెంచి పోషిస్తున్నదని విమర్శించారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఖర్గే, రాహుల్, ప్రియాంకను ఆహ్వానిస్తే మజ్లిస్‌కు భయపడి హాజరుకాలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ వస్తే మళ్లీ ట్రిపుల్ తలాక్‌ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక మాట నిలబెట్టుకోని ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలిచిపోయాడని విమర్శించారు. కాగా సభలో అమిత్ షా ప్రసంగిస్తుండగానే ప్రజలు లేచి వెళ్లిపోవడం కనిపించింది. బీజేపీ కార్యకర్తలు జనాలను ఆపేందుకు ప్రయత్నించినా ప్రసంగం ముగిసే సమయానికి ప్రాంగణం సగం ఖాళీ అయింది. వనపర్తి సభలో గాంధీనగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఎండ తీవ్రత తాళలేక సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే కొందరు యువకులు ఆమెను బయటకు తీసుకెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్ర : టీటీడీ జేఈవో
అంగన్వాడీకి పక్కా భవనం నిర్మించాలని ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

