TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్ర : టీటీడీ జేఈవో
TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులు కీలక పాత్ర పోషిస్తూ, భక్తికి, సంప్రదాయానికి, దేవాలయానికి , సమాజానికి మధ్య ఆధ్యాత్మిక వారధులుగా నిలుస్తున్నారని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పేర్కొన్నారు.
తిరుపతి : సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులు ( Priests ) కీలక పాత్ర పోషిస్తూ, భక్తికి, సంప్రదాయానికి, దేవాలయానికి , సమాజానికి మధ్య ఆధ్యాత్మిక వారధులుగా నిలుస్తున్నారని టీటీడీ ( TTD ) జేఈవో డా. ఎ. శరత్ ( JEO Sharath ) పేర్కొన్నారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 05 వరకు 15 రోజులపాటు నిర్వహించిన అర్చక శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం గురువారం తిరుపతిలోని శ్వేత భవన్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ సమాజంలో అర్చకులకు విశిష్టమైన గౌరవప్రదమైన స్థానం ఉందన్నారు. అర్చకత్వం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, తరతరాలకు ధర్మ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను అందించే పవిత్రమైన సేవ అని తెలిపారు. క్రమశిక్షణ, నిష్ఠ, భక్తి, సంప్రదాయాల పట్ల సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలని కోరారు.
భగవంతుని సన్నిధిలో అన్ని వర్గాలకూ సమాన ప్రాధాన్యత ఉందని, అన్ని సామాజిక వర్గాల వారు అర్చకత్వాన్ని స్వీకరించి సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఒక అర్చకుడు తయారైతే ఒక తరానికి ధర్మ సేవకుడు అందించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
శిక్షణ పూర్తి చేసుకున్న అర్చకులకు పూజా సామగ్రి, ధార్మిక గ్రంథాల అందజేత
15 రోజుల అర్చక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్చకులకు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాలతో పాటు ఇత్తడి పళ్లెం, గంట, హారతి పాత్ర, పలక, రెండు రాగి గ్లాసులు, ఉద్ధరిణి, ప్రశంసా పత్రాలను అందజేశారు. సకల దేవతా కల్యాణ ప్రయోగం, టీటీడీ పంచాంగం, ఆలయ అర్చన , ఆరాధన విధానం తదితర ధార్మిక గ్రంథాలను అందించి, అర్చక సేవలకు అవసరమైన ఆధ్యాత్మిక, పూజా సామగ్రిని అందించారు.
ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ అధ్యక్షులు తాళ్లూరి విష్ణు, జోనల్ ఇన్చార్జి రెడ్డెప్ప రావు, శ్వేత డైరెక్టర్ డాక్టర్ వేమా వేంకటరత్నం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్ర : టీటీడీ జేఈవో
అంగన్వాడీకి పక్కా భవనం నిర్మించాలని ఆందోళన
Supreme Court: నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల డెడ్లైన్: సుప్రీంకోర్టు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
రేపటి నుండి అర్వపల్లి దర్గా ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

