అంగన్వాడీకి పక్కా భవనం నిర్మించాలని ఆందోళన
ములకలపల్లి మండల పరిధిలోని మాధారం గ్రామంలో బురదమయంగా మారిన అంగన్వాడీ కేంద్రం ఎదుట గురువారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చిన్నారుల తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం మండల కార్యదర్శి...
ములకలపల్లి, నవంబర్ 05 : ములకలపల్లి మండల పరిధిలోని మాధారం గ్రామంలో బురదమయంగా మారిన అంగన్వాడీ కేంద్రం ఎదుట గురువారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చిన్నారుల తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాధారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్షం కురిస్తే భవనం పరిసరాలు బురదమయంగా మారి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నేటికీ పక్కా భవనాలు నిర్మించకపోవడం శోచనీయమన్నారు.
అద్దె భవనంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా మాధారం గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలను ఒకేచోట నిర్వహిస్తుండడంతో చిన్నారులకు అసౌకర్యం కలుగుతోందన్నారు. చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మాధారం గ్రామంలోని రెండు అంగన్వాడీ డీ కేంద్రాలకు నూతన పక్కా భవనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చనగాని వినోద్, పసుల సూర్య, ముదిగొండ రవి, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్ర : టీటీడీ జేఈవో
అంగన్వాడీకి పక్కా భవనం నిర్మించాలని ఆందోళన
Supreme Court: నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల డెడ్లైన్: సుప్రీంకోర్టు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
రేపటి నుండి అర్వపల్లి దర్గా ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

