IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
IPL 2027: లియాం లివింగ్‌స్టోన్ ఎస్ఆర్హెచ్ను వీడాడు . ఆ ఆల్‌రౌండర్ ఏడు కోట్లు వదులుకుని చెన్నై జట్టులో చేరాడు. హైదరాబాద్, చెన్నై ఐపీఎల్ జట్లు నలుగురు ప్లేయర్లను మార్చుకున్నాయి.
ముంబై: ఐపీఎల్(IPL)లో ప్లేయర్ రిటెన్షన్ తేదీ దగ్గరపడింది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయి. ఇరు జట్ల మధ్య నలుగురు ప్లేయర్లు మారనున్నారు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియాం లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా బౌలర్ జాక్ ఎడ్వర్డ్స్ ఇక హైదరాబాదీ జట్టును వీడి చెన్నై జట్టుతో చేరనున్నారు. దీనికి బదులుగా చెన్నై జట్టులోని పేసర్ ఖలీల్ అహ్మద్, మరో బౌలర్ నాథన్ ఎల్లిస్ ఇక వచ్చే సీజన్ నుంచి హైదరాబాద్ జట్టులో కలవనున్నారు. నలుగురు ప్లేయర్ల ట్రేడ్ డీల్‌కు చెందిన ప్రకటనను ఐపీఎల్ రిలీజ్ చేసింది.
అయితే ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ సుమారు 7 కోట్లు తక్కువకే చెన్నై జట్టుతో కలిసినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ జట్టు 13 కోట్లు పెట్టి లివింగ్‌స్టోన్‌ను ఖరీదు చేసిన విషయం తెలిసిందే. ఎడ్వర్డ్స్ మూడు కోట్లకు చెన్నైతో చేరాడు. ఖలీల్‌ను 4.8 కోట్లకే సన్‌రైజర్స్ సొంతం చేసుకున్నది. వాస్తవానికి 2018 నుంచి 2021 వరకు ఖలీల్ హైదరాబాద్‌కు ఆడాడు. కానీ 2025 సీజన్లో చెన్నై తరపున ఆడిన అతను 14 వికెట్లు తీసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ ఎల్లిస్ 2 కోట్లకే సన్‌రైజర్స్‌తో చేరాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసుకునేందుకు అనేక ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా పాండ్యాపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. కోల్‌కతా, రాజస్థాన్ జట్లు కూడా హార్దిక్ పాండ్యా కోసం ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే.
🚨 News 🚨
@ChennaiIPL and @SunRisers have completed a four-player trade ahead of #TATAIPL 2027.
Liam Livingstone (INR 6 Crore, revised fee) and Jack Edwards (INR 3 Crore) move to #CSK, while Khaleel Ahmed (INR 4.8 Crore) and Nathan Ellis (INR 2 Crore) join #SRH.
Details ▶️ https://t.co/wC0HDKvRzJ
— IndianPremierLeague (@IPL) November 5, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్ర : టీటీడీ జేఈవో
అంగన్వాడీకి పక్కా భవనం నిర్మించాలని ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

