AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘పరిషత్’ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 30.50 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 36.35 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా బాపట్లలో 23.89 శాతం ఓట్లు పోలయ్యాయి.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘పరిషత్’ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 30.50 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 36.35 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా బాపట్లలో 23.89 శాతం ఓట్లు పోలయ్యాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా గురవారం ఉదయం 7 గంటల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుంది.
ఉదయం నుంచే ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 21,012 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాల్లో 2.61 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డాక నామినేషన్ల ఉపసంహరణ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,128 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది, జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది పోటీ పడుతున్నారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,01,116 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సేవలు వినియోగిస్తున్నారు. వీరిలో రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, అసిస్టెంట్, ఇతర ప్రిసైడింగ్ అధికారులు, జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు ఉన్నారు. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు మండలాల్లో పూర్తిగా, మరో మండలంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ను వాయిదా వేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్ర : టీటీడీ జేఈవో
అంగన్వాడీకి పక్కా భవనం నిర్మించాలని ఆందోళన
Supreme Court: నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్: సుప్రీంకోర్టు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

