కులవృత్తులపై కేంద్రప్రభుత్వం కుట్ర
- విద్యుత్తు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి
- త్వరలో చలో ఢిల్లీ.. పార్లమెంట్‌ను ముట్టడిస్తాం
ఎస్సీ, ఎస్టీ నాయీబ్రాహ్మణ, ముప్పు భిక్షపతి, ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు దూగుంట్ల నరేశ్, ఎస్సీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం, తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపకుడు జన్ను కనకరాజు సోమవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్ఎన్రెడ్డిభవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, నాయీబ్రాహ్మణ, రజకులకు ప్రతి నెల రూ.21.72 కోట్ల విలువైన విద్యుత్తును తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా సరఫరాచేస్తూ కులవృత్తులకు తోడ్పాటు అందిస్తున్నదని చెప్పారు. విద్యుత్తును ప్రైవేటీకరిస్తే కులవృత్తులు ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్తు చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్‌తో త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటుచేసి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మర్మాంగాల మల్లేశ్ మాదిగ, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాస్, పలు కుల సంఘాల నాయకులు మానస గణేశ్, అక్కిరాజు శ్రీనివాస్, డాక్టర్ రాజుకుమార్, గడ్డం యాదన్న, బలరాం, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Himayatnagar
- media
- Parliament
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

