రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తరు?
నిరుద్యోగుల ఓ ట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్, వారిపైనే ఉక్కుపాదం మోపుతున్నదని నిరుద్యోగ జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారంటూ ప్రశ్నించారు. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
- సర్కార్ హామీ నిలబెట్టుకునే వరకు పోరాటం
- నిరుద్యోగ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
ఖైరతాబాద్, ఆగస్టు 12 : నిరుద్యోగుల ఓ ట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్, వారిపైనే ఉక్కుపాదం మోపుతున్నదని నిరుద్యోగ జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారంటూ ప్రశ్నించారు. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ జేఏసీ నాయకురాలు ఆస్మా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీ యింబర్స్‌మెంట్ రెండున్నరేండ్లుగా ఇవ్వకపోవడంతో అనేకమంది చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో నియామకాలు నిలిచిపోయాయని, నిరుద్యో గం గణనీయంగా పెరుగుతున్నదని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవులు అన్నారు. తెలంగాణలో పదకొండు విశ్వవిద్యాలయాల్లో 3 వేల టీచర్ల పోస్టుల్లో రెండు వేలు ఖాళీగా పెడితే విశ్వవిద్యాలయాలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి తుంగబాలు మాట్లాడుతూ 2023 ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చిక్కడపల్లి, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ వేదికగా యువతను రెచ్చగొట్టి, మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, అప్పుడు జరిగిన పరీక్షల్లో అర్హత సాధించినవారికి ఇప్పుడు నియామకపత్రాలు అందజేసి గొప్పలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో తెలంగాణ విఠ ల్, నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి అశోక్, ఆప్ నా యకురాలు హేమా సుదర్శన్, నిరుద్యోగ జేఏ సీ నాయకులు ఆర్ ఇంద్రానాయక్, భూక్యాకుమార్, ఏ సూర్య, రాజు, రవి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

