ఖైరతాబాద్, మే 9 : 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసగించిన కాంగ్రెస్ ప్ర భుత్వ దమననీతిని ఖండిస్తూ ఈ నెల 20 న ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఉద యం 11గంటలకు నిరుద్యోగుల ‘ఆవేదన సభ’ నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ ప్రతినిధు లు వేణు, నాగరాజు, శ్రీధర్, వేణుగోపాల్, రజి యా సుల్తానా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు వయోపరిమితి పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించిందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని, కానీ గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లు, అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలిచ్చి తామే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ యువత అర్హత వయసు కోల్పోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో-42 తీసుకొచ్చి 34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు వయోపరిమితి పెంచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ మొక్కుబడిగా రెండేండ్లు పెంచిందని, ఆ గడువు సైతం ఈ ఏడా ది ఫిబ్రవరిలో ముగియడంతో తిరిగి కొత్త జీవో జారీ చేసి వయోపరిమితి పెంచాల్సి ఉండగా, ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో మళ్లీ 34 ఏండ్లకు కుదించబడిందని వాపోయారు. ఫలితంగా ఇటీవల వచ్చిన నోటిఫికేషన్లలో ఆ వయసు దాటిన వారికి అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచి జీవో-30ని కొనాసాగించాలని డిమాండ్ చేశారు.