హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులు, ఐటీరంగ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ అంశాలపై విన్నవించనున్నారు. అనంతరం యూకే ఎంపీ, తెలంగాణ బిడ్డ ఉదయ్నాగరాజ్ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు.