హైదరాబాద్, జూలై 27 : రాష్ర్టానికి చెందిన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కంపెనీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.25.57 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.22.40 కోట్లతో పోలిస్తే 14.15 శాతం వృద్ధి నమోదైంది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం 25 శాతం ఎగబాకి రూ.300.45 కోట్లకు చేరుకున్నట్టు కంపెనీ సీఎండీ జే లక్ష్మణ రావు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందన్నారు. భవిష్యత్తు వ్యాపార విస్తరణలో భాగంగా త్వరలో సెమికండక్టర్ ప్యాకేజింగ్ విభాగంలోకి అడుగుపెడుతున్నట్టు ఆయన ప్రకటించారు.