చిక్కడపల్లి, జూలై 12 : నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని పలువురు నిరుద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై నల్లగొండలో అఖిల్, సిరిసిల్లలో శ్రీకాంత్ చనిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. వారి మృతికి నివాళి అర్పిస్తూ చిక్కడపల్లి నగర గ్రంథాలయం వద్ద శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేశ్, కిరణ్, లక్ష్మీకాంత్, వెంకటేశ్, సంపత్ మాట్లాడుతూ.. నోటిఫికేషన్స్ విడుదలలో జాప్యంతోనే అఖిల్, శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.