Home
Telangana
Under The Road Development Fund Rdf Scheme The Government Has Provided Rs 153 9 Crore For Various Developments In The State
రూ.154 కోట్లతో రోడ్ల అభివృద్ధి.. ఆర్డీఎఫ్ స్కీమ్ కింద డెవలప్ చేయనున్న రహదారులు ఇవే..
రోడ్ డెవలప్మెంట్ ఫండ్ (ఆర్డీఎఫ్) స్కీమ్ కింద రాష్ట్రంలోని వివిధ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.153.9 కోట్లు మంజూరు చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రోడ్ డెవలప్మెంట్ ఫండ్ (ఆర్డీఎఫ్) స్కీమ్ కింద రాష్ట్రంలోని వివిధ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.153.9 కోట్లు మంజూరు చేసింది. వివిధ జిల్లాల్లోని ముఖ్యమైన రోడ్లను అభివృద్ధి చేయాలన్న స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదన మేరకు రోడ్లు, భవనాల శాఖ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపడంతో ఈ నిధులు మంజూరయ్యాయి. వీటితో పలు సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడంతోపాటు మరికొన్ని రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకోసం త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అభివృద్ధి చేయనున్న రోడ్ల అంచనా వ్యయం
- నిజామాబాద్ జిల్లాలో వేల్పూర్-అంక్సాపూర్ సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్‌గా మార్చేందుకు రూ.8.10 రూ.కోట్లు.
- బాల్కొండ నియోజకవర్గంలో 10 రోడ్లకు రూ.60.65 కోట్లు.
- జగిత్యాల జిల్లాలో కథలాపూర్-దుంపేట రోడ్ విస్తరణకు రూ.6 కోట్లు.
- సిద్దిపేట జిల్లాలో రాగోపాల్పేట-ఇబ్రహీంనగర్ వయా గోనెపల్లి రోడ్డుకు రూ.14.50 కోట్లు, కిస్టాసాగర్-సిద్దిపేట రోడ్డుకు రూ.3.65 కోట్లు.
- ఏఆర్ సబ్-హెడ్‌క్వార్టర్స్-కరీంనగర్ జిల్లా సరిహద్దు రోడ్డుకు రూ.12.50 కోట్లు.
- మహబూబ్‌నగర్-నల్లగొండ రోడ్డుపై హెచ్ఎల్ బ్రిడ్జీ పునర్నిర్మాణం, సీసీ పేవ్‌మెంట్‌కు రూ.12.40 కోట్లు.
- మహబూబ్‌నగర్‌లోని గుండ్యాల్ స్టేజ్-కొమిరెడ్డిపల్లి వయా షేక్‌పల్లి రోడ్డుకు రూ.10 కోట్లు.
- తుంగతుర్తి నియోజకవర్గంలో జాజిరెడ్డిగూడెం-మనపురం తండా పీడబ్ల్యూడీ రోడ్డుకు రూ.3 కోట్లు.
- జుక్కల్ నియోజకవర్గంలో ఎస్ఎన్ఏ రోడ్డు-బోర్గి తంతా వయా శివపూర్ రోడ్డుకు రూ.6 కోట్లు.
- ముధోల్ నియోజకవర్గంలో బాసర-ఆబాదీ రోడ్డు వయా పోలీస్ స్టేషన్ రోడ్డుకు రూ.4.50 కోట్లు.
- ఆదిలాబాద్ జిల్లా బోథ్-నిగ్నీ-కైలాశ్ టేక్డి రోడ్డుకు రూ.12.60 కోట్లు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

