హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆవిర్భావం దేశ రైతాంగానికి నూతన ఉషోదయమని రాష్ట్ర పోలీస్ హౌసిం గ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ అనతికాలంలోనే దేశం గర్వించేస్థాయికి ఎదిగిందని శనివారం పేర్కొన్నారు. పుష్కలమైన సహజ, మానవ వనరులు ఉన్నా 75 ఏండ్లకాలంలో ఏ పాలకుడూ దేశగతిని మార్చలేకపోయారని చెప్పారు. తెలంగాణను ప్రగతిబాటలో నడిపిస్తున్న కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నదని తెలిపారు