వరంగల్ : వరంగల్(Warangal) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మామ(Uncle killed)ను అల్లుడు(son-in-law) హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన రంగశాయిపేట (Rangasaipet) ఉర్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
రంగశాయిపేటకు చెందిన బజ్జూరి రమేష్ కుమార్తెతో సుమారు 11 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తికి పెళ్లి జరిగింది. నాటి నుంచి నేటి వరకు తరచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఇరువురికి గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రమేష్ చేతిలో శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. ఈ మేరకు నిందితుడు మిల్స్ కాలనీ పోలీస్లకు లొంగిపోయాడు.