హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పండ్ల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏసీసీఐ), మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మామిడి కాయలను పండ్లుగా మార్చేందుకు వ్యాపారులు కార్బైడ్ లాంటి హానికర రసాయనాలను వినియోగిస్తుట్టు ఫిర్యాదులు వస్తుండటంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో హైదరాబాద్లోని పలు ప్రాం తాలతోపాటు జగిత్యాలలో 10, రంగారెడ్డి జిల్లా బాటసింగారం (గడ్డి అన్నారం) మార్కెట్ పరిధిలో 7, వరంగల్లో 5 చోట్ల విస్తృత స్థాయిలో తనిఖీలు చేశారు. మోతాదుకు మించి ఎథిలిన్ను వాడుతున్నట్టు గుర్తించి, రసాయనాలతో మాగబెట్టిన పండ్లను సీజ్ చేశారు.