వర్ని, ఆగస్టు 30 : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. పలు సంఘాల వారు, కుల సంఘాల ప్రతినిధులు పోచారం వెంటే ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా బుధవారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రామ యాదవ, పద్మశాలీ కులస్థులు, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామస్థులు వచ్చే ఎన్నికల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామంటూ తీర్మానం చేశారు.
ఈ మేరకు కుల సంఘాల పెద్దలు, పోచారం గ్రామస్థులు బుధవారం బాన్సువాడకు చేరుకొని స్పీకర్ను కలిసి తీర్మాన ప్రతిని అందజేశారు. పద్మశాలీ కులానికి చెందిన 55 కుటుంబాలు, యాదవ సంఘానికి చెందిన 65 కుటుంబాల వారు తీర్మానం పత్రంలో సంతకాలు చేశారు.