హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో ఇబ్బడి ము బ్బడిగా ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు పెరిగిపోతున్నాయి. ఒక్కో వర్సిటీ వేలకు వేల మందిని చేర్చుకుంటున్నాయి. వీటి నుంచి పోటీని తట్టుకోలేకపోతున్నాం. వర్సిటీల్లో రిక్రూట్మెంట్ లేదు. నిధులు సరిపోవడంలేదు. ప్రమాణాలనెలా మెరుగుపరిచేది’ అంటూ పలువురు వర్సిటీల వైస్ చాన్స్లర్లు సోమవారం ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌పై సోమవారం ములుగులోని హార్టికల్చర్ వర్సిటీలో జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, పలు వర్సిటీల వీసీలు హాజరయ్యారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌పై కన్సల్టెంట్ నిపుణుడు డాక్టర్ కే వీరాంజనేయులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
జాతీయ, అంతర్జాతీయ భాగస్వామ్యం, ప్లేస్‌మెంట్స్ తదితర వాటిని వివరించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, పలు వర్సిటీల వీసీలు కిషన్‌కుమార్‌రెడ్డి, రాజిరెడ్డి, అల్తాఫ్ హుస్సేన్, ప్రతాప్‌రెడ్డి, జీఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.