చేగుంట, జూన్ 17: గుండెపోటు తో అల్లుడు మరణించిన గంటల వ్యవధిలోనే అత్త కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది. చేగుంట మండలం మక్కరాజిపేటకు చెందిన మంగళి నర్సింహులు (50) గ్రామంలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా డు. ఆదివారం అస్వస్థతతకు గురికావడంతో నార్సింగిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రై వేటు దవాఖానకు చేర్పించగా, గుండె పోటుతో మృతి చెందాడు. నర్సింహు లు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మం డలం చిగురుపల్లికి చెందిన నర్సింహు లు అత్త న్యాలపోగుల నర్సమ్మ (60) అల్ల్లుడి మృతదేహం వద్ద రోదించింది. అల్లుడి మృతిని తట్టుకోలేక తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతిచెందింది.