జడ్చర్ల టౌన్, అక్టోబర్ 10 : అన్న మృతి చెందాడన్న విషయం తెలుసుకొన్న తమ్ముడి గుండె ఆగిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. జడ్చర్లలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న సురేందర్‌రావు (62) గుండె సమస్యతో 8న హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానలో ఆపరేషన్ చేశారు.
9న వనపర్తిలో ఉంటున్న అతడి అన్న నర్సింహారావు(80) గుండెపోటు తో మృతి చెందాడు. విషయం తెలియడంతో సురేందర్‌రావు కూడా కుప్పకూలిపోయాడు.