మణుగూరు టౌన్, ఆగస్టు 14 : పొలం పనులకు వెళ్లిన భర్త గుండెపోటుతో విగతజీవిగా మారాడు. భర్త లేడని తెలుసుకున్న భార్య గుండె బరువెక్కింది. ‘నీవు లేక నేనెందుకు’ అనుకుందేమో.. భర్తతోపాటు ఆమె కూడా గుండెపోటుతో తనువు చా లించింది. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. బాలాజీనగర్లో నివాసం ఉండే రిటైర్డ్ సింగరేణి కార్మికుడు కొమ్ము సోమ య్య (72), శంకరమ్మ (65) భార్యాభర్తలు. వారికి ముగ్గురు పిల్లలు. సోమయ్య బుధవారం పొలం వద్ద పనులు చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో మృతి చెందాడు. గమనించిన తోటి రైతులు అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. భర్త మృతదేహాన్ని చూసిన శంకరమ్మ షాక్కు గురై గుండెపోటుతో అక్కడికక్కడే తనువు చాలించింది.