(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): భారత్లో పౌరహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నదని ‘ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ (యూఎన్హెచ్ఆర్సీ)’ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షిత వర్గంపై ఉపా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) వంటి తీవ్రవాద వ్యతిరేక చట్టాలను అకారణంగా ప్రయోగించడం ఇటీవలి కాలంలో పెరిగిందని మండిపడింది. ‘యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ’ (యూపీఆర్) పేరిట నాలుగేండ్లకు ఒకసారి జరిగే ఈ సమీక్షా సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధులు, పౌరహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు భారత్లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కారుకు పలు ప్రశ్నలు వేయడంతో పాటు.. సూచనలూ చేశారు.