Un Employees | హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత కదం తొక్కారు. జాబ్ జ్యాలెండర్ విడుదల చేయాలని, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఖమ్మం వీధులు నిరుద్యోగుల నినాదాలతో మార్మోగిపోయాయి.
ఖమ్మం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొన్న మానుకోటలో, ఈ రోజు ఖమ్మంలో నిరుద్యోగ యువత రోడ్డెక్కిన తీరు చూస్తుంటే రేవంత్ రెడ్డి ఉద్యోగం త్వరలో ఊడిపోవడం ఖాయమనిపించింది అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగిందని దేశమంతా ప్రచారం చేస్తున్నారు. కానీ, అసలైన ఓట్ చోరీ తెలంగాణలో జరిగింది అదే నిరుద్యోగు యువత ఓట్ల చోరీ అని విమర్శించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 10 ఏళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారం పోతుందేమో అన్న భయంతో నోటికొచ్చిన హామీ ఇచ్చింది. కానీ, తమకు ఉద్యోగాలు రాగానే నిరుద్యోగులను మరిచిపోయారు. ఎన్నికల్లో ప్రచార సామగ్రిని ఎలా వాడుకొని వదిలేస్తారో అలాగే నిరుద్యోగులను సైతం ప్రచారానికి బస్సు యాత్రలకు వాడుకొని వదిలేశారు. గ్రూప్ -1 ఉద్యోగాల రూపంలో తెలంగాణ ఉద్యోగాల చోరీ కూడా బట్టబయలు అయింది. ఇప్పుడు ఆ ఓట్ల చోరీని కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నిరుద్యోగులను ఓడించడానికి లాయర్లకు కోట్లు ఖర్చు చేస్తుంది అని రాకేశ్ రెడ్డి ఆరోపించారు.
ఖమ్మం, నిరుద్యోగ ర్యాలీ.
🔹ఖమ్మంలో కధంతొక్కిన నిరుద్యోగ యువత.
🔹జాబ్ జ్యాలెండర్ విడుదల చేయాలని, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని మార్మోగిన ఖమ్మం వీధులు.
🔹ఖమ్మం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ ర్యాలీ కి హాజరవ్వడం జరిగింది.… pic.twitter.com/IdYqRYeOC3
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) September 25, 2025