హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర కార్యదర్శిగా ఉదావత్ లచ్చిరాం నియమితులయ్యారు. నల్లగొండ జిల్లాకు చెందిన లచ్చిరాం మర్రిగూడ మండలంలోని దామెన భీమనపల్లిలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నా రు.
సీపీఎస్ రద్దుకు లచ్చిరాం చేస్తున్న పోరాటాన్ని గుర్తించిన సంఘం ఆయన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్‌కు లచ్చిరాం కృతజ్ఞతలు తెలిపారు.