హనుమకొండ: జిల్లాలోని ఎస్సారెస్పీ (SRSP) కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సోమవారం ఉదయం ఎల్కతుర్తి వద్ద ఎస్సారెస్పీ కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. గుర్తించిన స్థానికులు వారికోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన యువకులను బావా మరుదులైన వరుణ్, వంశీగా గుర్తించారు.