మెదక్ : మెదక్ జిల్లాలో(Medak) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్, లారీ ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన పిల్లికొట్యాల్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శంకరం పేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన నవీన్(23), వంశీ(25), నవీన్ సోదరి భాగ్య ముగ్గురు కలిసి బైక్ వెళ్తున్నారు.
ఈ కక్రమంలో పిల్లికొట్యాల్ వద్ద బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. భాగ్యకు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా మారింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి భాగ్యను హాస్పిటల్‌కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | కొనుగోలు కేంద్రాల్లేక ధాన్యం దళారుల పాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు : హరీశ్ రావు
Future City | ప్రాణాలు పోయినా భూములివ్వం.. కందుకూరు, కొడంగల్‌లో తిరగబడ్డ రైతులు