కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మణుగూరులో (Manuguru) వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను అశ్వాపురం మండలానికి చెందిన ఆసిఫ్ పాషా, భీష్మా రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.