జైనథ్లో పెద్ద పులుల కలకలం..!
Tigers | ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతున్నది. గూడ గ్రామ శివారులో ఇవాళ ఉదయం రెండు పులులు సంచరించాయి. ఈ విషయంపై అటవీ అధికారులకు స్థానికులు సమాచారం
హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతున్నది. గూడ గ్రామ శివారులో ఇవాళ ఉదయం రెండు పులులు సంచరించాయి. ఈ విషయంపై అటవీ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పెన్గంగ కాలువ వద్ద పులులు సంచరిస్తుండగా.. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
చనకా – కొరటా కెనాల్ గుండా పెద్ద పులులు నడుచుకుంటూ వెళ్లగా.. స్థానికులు కొందరు పులులను సెల్ఫోన్లలో వీడియో తీశారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి పులులు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇటీవలికాలంలో పెద్ద పులుల సంచారం పెరిగింది. పలుచోట్ల పశువులపై దాడి చేసిన సంఘటనలున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రాపూర్ రెండు జిల్లాల్లో పులుల దాడులు పలువురిపై దాడికి పాల్పడ్డాయి. చంద్రాపూర్ జిల్లాలో ఒక్కరు, గడ్చిరోలీ జిల్లాలో మరొకరు పులి దాడిలో మృతి చెందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- Jainath
- Telugu News
- tigers
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

