రామచంద్రాపురం,జూలై29: సర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్‌లో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సర్ ప్రక్రియ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో బీఎల్ఏలు పర్యటించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ ఫారా లు బీఎల్వోలకు అందజేసేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమన్నారు.
సర్ ప్రక్రియలో బీఆర్ఎస్ బుత్ లెవల్ ఏజెంట్లు అద్భుతంగా పని చేస్తునప్పటికీ నమోదు శాతం ఆశించినంత లేదని చెప్పారు. ఐదు రోజులు మరింత కష్టపడి పనిచేసి ఓటర్లను కలిసి సర్‌లో భాగస్వాములను చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు ఐలేశ్, ప్రమోద్‌గౌడ్, సత్యనారాయణ, గఫార్, బూన్, పాపయ్యయాదవ్, నర్సింగ్‌రావు, రాజు, జంగయ్య, క్రాంతి పాల్గొన్నారు.