సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. డివైడర్ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం(,students died) చెందారు. ఈ విషాదకర సంఘటన పటాన్చెరు పట్టణం(Patancheru) నోవోపాన్ సమీపంలో జాతీయ రహదారి పై రోడ్ తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..స్కూటీ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు డివైడర్ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు ఆర్. భరత్ చందర్ (19) పి.నితిన్, (18) అక్కడిక్కడే మృతి చెందగా ఎ.వంశీ (19) తీవ్రగాయాలయ్యాయి.
గాయపడిన వంశీని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. వీరంతా సుల్తాన్పూర్ జేఎన్టీయూలో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విషాద ఛాయలు అలుముకున్నాయి.