హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ చదువు.. విద్యార్థి ఉన్నత చదువులకు టర్నింగ్ పాయింట్. అంతేకాదు టెన్షన్పడేది కూడా ఇక్కడే. సిలబస్ అధికంగా ఉండటంతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దీంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తుం టాం. విద్యార్థుల్లోని ఒత్తిడి, టెన్షన్‌ను దూరం చేసేందుకు ఇంటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరానికి స్పోర్ట్స్ క్యాలెండర్‌ను రూపొందించాలని నిర్ణయించింది. ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేయ గా, జూన్‌కల్లా స్పోర్ట్స్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యాలెండర్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కార్పొరేట్ కాలేజీలు సహా అన్ని ంటిలోనూ క్యాలెండర్ అమలయ్యేలా చూస్తారు.