హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యలో కొత్త లెక్చరర్లకు పోస్టింగ్స్‌లో వింతలు చోటుచేసుకున్నాయి. ఒకే లెక్చరర్‌కు రెండు కాలేజీల్లో పోస్టింగ్నిచ్చారు. రెండు ఉత్తర్వులు ఒకే తేదీన ఇవ్వడం గమనార్హం. నేనావత్ లాలు సివిక్స్ లెక్చరర్‌గా ఎంపిక కాగా మల్టీ జోన్-2లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గట్టు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ పటాన్‌చెరువులో పోస్టింగ్నిచ్చారు.
రెండుచోట్ల పోస్టింగ్ ఇవ్వడం అధికారులు తప్పిదమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇంటర్బోర్డులో మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీల్లోని రెండో సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు అనుమతించారు. ఎవ రిని సంప్రదించకుండానే ఓ అధికారి కావాలనే అనుమతినిచ్చినట్టుగా తేలింది. తాజాగా మరో కీలక అధికారి సెక్షన్లో తప్పి దం జరగడం పలు అనుమానాలకు తావిస్తున్నది.్ర