ఇల్లంత కుంట / సిరిసిల్ల రూరల్ ఏప్రిల్ 19 : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద మిడ్ మానేరులో ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురిలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరిని స్థానికులు కాపాడారు. మృతులు ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన కుర్రు శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పొన్నం రాజుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలని సిరిసిల్లా ఏరియా దవాఖానకు ఇద్దరి మృతితో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.