వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 12: స్వల్ప పెట్టుబడి, నీటి వినియోగంతో అధిక దిగుబడినిచ్చే రెండు కొత్త రకాల పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) వంగడాలు మార్కెట్లోకి వచ్చాయి. ఐఎస్ఎస్-300, ఐఎస్ఎఫ్-15 పేరుతో వీటిని డాక్టర్ జీడీ సతీశ్ కుమార్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కనుగొన్నది.
ఐసీఏఆర్-ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ మాథూర్ సోమవారం తన చాంబర్లో వీరిని అభినందించారు. ఐఎస్ఎస్-300 రకం హెక్టార్‌కు దాదాపు 1,800 కిలోల దిగుబడినిస్తుంది. దీనిలో 38% వరకు నూనె ఉంటుందని వివరించారు.