వేములవాడ టౌన్, జూన్ 7: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో అనారోగ్యంతో ఉన్న మరో రెండు కోడెలు శనివారం మృతిచెందినట్టు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గోశాలలో 1,300 కోడెలు ఉండగా, ప్రస్తుతం 14 కోడెలకు వెటర్నరీ డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. 10 కోడెలు కోలుకుంటున్నాయని, మరో రెండు కోడెల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా ఇప్పటివరకు 33 కోడెలు మృతి చెందినట్టు పేర్కొన్నారు.