హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)/భిక్కనూరు: మహిళల ఉచిత బస్సు పథకంతో గిరాకీ లేక, నెలవారీ కిస్తీలు చెల్లించలేక మనస్తాపం చెందిన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు తనువు చాలించారు. మేడ్చల్ మల్కాజిరిగి జిల్లా మౌలాలి హౌసింగ్ బోర్డు పరిధిలో కైలాసగిరికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీవన్ (24) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వరపల్లికి చెందిన ఆటో డ్రైవర్ తుమ్మ శ్రీధర్ (38) ఈ నెల ఒకటిన గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలన్నింటికీ కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీఏటీయూ అధ్యక్షుడు వేముల మారయ్య హెచ్చరించారు.
ఉండవెల్లి, ఆగస్టు 8: ఇండ్ల ముందు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈ ఘటన గురువారం జో గుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మం డలం ప్రాగటూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీకాంత, నగేశ్ దంపతుల కుమారుడు రిషి, చంద్రకళ, నాగరాజు కుమారుడు విజయ్‌కుమార్, చంద్రశేఖర్, శారద కుమారుడు తిరుమలేశ్ కలిసి ఆడుకుంటున్నారు. వారిపై వీ ధికుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపర్చాయి. చిన్నారులను అలంపూర్, క ర్నూల్ దవాఖానలకు తరలించామని తల్లిదండ్రులు తెలిపారు.
వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 8 : ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వ్యవసా య డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 12న నేరుగా హాజరుకావాలని రిజిస్ట్రార్ రఘురాంరెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్లో జరిగే కౌన్సెలింగ్‌కు విధి గా హాజరుకావాలని చెప్పారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజు రూ.19,460(గవర్నమెంట్), రూ.22,210(ప్రైవేట్)తో హాజరుకావాలని సూచించారు.