హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజా సంబంధాల అధికారులు(పీఆర్వో)గా మరో ఇద్దరు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. బొల్గం శ్రీనివాస్, మామిడాల శ్రీధర్‌ను కాంట్రాక్టు పద్ధతిలో పీఆర్వోలుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. సీనియర్ జర్నలిస్టు అయిన బొల్గం శ్రీనివాస్ గతంలో ఈనాడు, సాక్షిలో పనిచేశారు. ప్రస్తుతం వెలుగు బ్యూరోచీఫ్‌గా పనిచేస్తున్నారు.