INDW vs SLW : భారత స్టార్ ఆల్‌రౌండర్ చెలరేగిపోతోంది. అర్ధ శతకంతో జట్టును ఆదుకున్న ఆమె బంతితో వికెట్ల వేటతో శ్రీలంకను వణికిస్తోంది. చమరి ఆటపట్టు(43)ను ఔట్ చేసిన దీప్తి.. ఆతర్వాతి ఓవర్లలో డేంజరసర్ కవిష దిల్హరి(15), అనుష్క సంజీవని(6)లను పెవిలియన్ పంపింది. 30 ఓవర్లకు లంక స్కోర్.. 147/6.
దీప్తి సంధించిన ఫుల్ డెలివరీని సంజీవని మిడాన్‌లో ఆడబోయి హర్మన్‌ప్రీత్ కౌర్‌కు దొరికిపోయింది. దాంతో.. 140 వద్ద లంక ఆరో వికెట్ కోల్పోయింది. ప్రధాన బ్యాటర్లు అందరూ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ టీమిండియా వైపు తిరిగింది. ప్రస్తుతం సుగంధిని కుమారి(1), నిలాక్షి డిసిల్వా(18) పోరాడుతున్నారు. ఇంకా విజయానికి 124 రన్స్ అవసరం కాగా.. భారత్‌కు నాలుగు వికెట్లు కావాలి.
Decision overturned!
A sharp catch behind the stumps from Richa Ghosh! 💪
Second wicket for Deepti Sharma ⚡️
Updates ▶️ https://t.co/m1N52FKTWT#TeamIndia | #WomenInBlue | #CWC25 pic.twitter.com/sNY9g6SIIF
— BCCI Women (@BCCIWomen) September 30, 2025
గువాహటిలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఓపెనర్‌లో భారత బౌలర్లు వికెట్ల వేట మొదలెట్టారు. భారీ ఛేదనలో బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ శ్రీలంక స్కోర్‌బోర్డును ఉరికిస్తున్న చమరి ఆటపట్టు (43)ని వెనక్కి పంపారు. దీప్తి శర్మ సూపర్ డెలివరీతో డేంజరస్ బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో, రెండో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అంతే అక్కడి నుంచి లంక బ్యాటర్ల పతనం మొదలైంది.