Carlos Alcaraz : వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) జోరు మీదున్నాడు. ఇటీవలే యూఎస్ ఓపెన్ ట్రోఫీ గెలుపొందిన ఈ స్పెయిన్ స్టార్.. జపాన్ ఓపెన్ (Japan Open)లోనూ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్ (Taylor Fritz)ను ఓడించాడు. ఈ సీజన్లో 68వ విజయం నమోదు చేయడంతో పాటు ఎనిమిదో టైటిల్ సొంతం చేసుకోవడం గమనార్హం.
పురుషుల టెన్నిస్‌లో అల్కారాజ్ దూకుడుకు ప్రత్యర్థులు తోకముడుస్తున్నారు. జనిక్ సిన్నర్‌కు చెక్ పెట్టిన అతడు ఈసారి అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్ టైటిల్ ఆశలపై నీళ్లు చల్లాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో అల్కరాస్ ధాటికి స్విఫ్ట్ నిలువలేకపోయాడు. తొలి సెట్‌ను 6-4తో కైవసం చేసుకున్న అతడు రెండో సెట్లోనూ అదే దూకుడు కనబరిచాడు. ఇంకేముంది అమెరికా సంచనలంపై లావెర్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ 6-4తో గెలుపొందాడు అల్కరాజ్. దాంతో, ఏటీపీ టూర్లో అతడు 24వ టైటిల్ సాధించాడు.
Feeling like on top of the Tokyo Tower 🗼
Wait for the dance 🕺@carlosalcaraz #kinoshitajotennis pic.twitter.com/3iuGGcUs3B
— Tennis TV (@TennisTV) September 30, 2025
‘టోక్యోలో జపాన్ అభిమానుల సమక్షంలో ఫైనల్ ఆడడం చాలా ఒత్తిడిగా అనిపించింది. నా మోకాలి గాయం వేధించిన ఆ ఐదు నిమిషాలు తప్ప.. కోర్టులో ప్రతి సెకన్ను నేను ఎంతో ఎంజాయ్ చేశాను. ఫైనల్లో స్విఫ్ట్‌పై టాప్‌గేర్‌లో ఆడి గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. గాయంతో టోర్నీలో అడుగుపెట్టి.. ఫైనల్ చేరడమే కాకుండా ట్రోఫీని ముద్దాడడం చాలా గొప్పగా అనిపిస్తోంది’ అని మ్యాచ్ అనంతరం అల్కరాజ్ తెలిపాడు.