హైదరాబాద్: మేడ్చల్ (Medchal) జిల్లాలో అర్ధరాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. నగర శివార్లలోని దూలపల్లిలో బైకును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరోఘటనలో అయోధ్యనగర్లో బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరొకరు చనిపోయారు. రెండు ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.