Road Accident | దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
Road Accident | మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి దర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Road Accident | జహీరాబాద్, మే 5 : మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి దర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్ గ్రామ శివారులోని 65వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ కథనం ప్రకారం… స్థానిక పట్టణ పరిధిలోని పస్తాపూర్ గ్రామ శివారులోని హైదరాబాద్ ముంబై 65వ జాతీయ రహదారిపై ఓవర్ లోడ్‌తో ఉన్న ట్రక్కు వెనక్కి వస్తూ.. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. అదే సమయంలో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు సైతం టాటా ఏస్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కాసుల మహేశ్ గౌడ్ (26), రోహిత్(16) అక్కడికక్కడే మరణించారు. నర్సింహులు (32), కార్తీక్(27) సాయి(9) తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే జహీరాబాద్ పట్టణ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా, వీరంతా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

