యాదాది భువనగిరి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో దారుణం జరిగింది. ఎస్సీ హాస్టల్లో టెన్త్ విద్యార్థినులు ఇద్దరు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చేయని తప్పునకు మాట పడాల్సి వచ్చిందని మనస్తాపం చెంది ప్రా ణాలు తీసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. స్థానికులు కథనం ప్రకారం.. భువనగిరి పట్టణం బీచ్‌మహల్లా ప్రాంతంలోని బాలికల ఉన్న త పాఠశాలలో శనివారం మధ్యాహ్నం ఏడోతరగతి, పదోతరగతికి చెందిన పలువురు విద్యార్థినుల మధ్య గొడవ జరిగింది. ఇదే విషయమై పాఠశాలలోని ఓ టీచర్ హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆమె విద్యార్థినులను మందలించింది. దీంతో టెన్త్ విద్యార్థినులు కోడి భవ్య (15), గాదె వైష్ణవి(15) మనస్తాపానికి గురయ్యా రు.
వీరు ఎస్సీ హాస్టల్లో ఉంటున్నారు. సాయం త్రం తర్వాత విద్యార్థినులంతా డిన్నర్‌కు వెళ్లగా, వీరు మాత్రం వెళ్లలేదు. అనుమానం వచ్చి తోటి విద్యార్థినులు గదిలోకి వెళ్లి చూడగా, భవ్య, వైష్ణవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో స్థానిక భువనగిరి ఏరియా దవాఖానకు తరలించగా, అప్పటి కే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిద్దరి స్వస్థలం హైదరాబాద్. విద్యార్థినుల మృతదేహాలను డీఈవో నారాయణరెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘చేయని తప్పునకు మాట పడాల్సి వచ్చింది. చనిపోయిన తరువాత మా ఇద్దరిని ఒకే దగ్గర సమాధి చేయా లి’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.