నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 40,406 క్యూసెక్యుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను ఐదడుగు మేర ఎత్తివేశారు. స్పిల్ వే, విద్యుదుత్పతి ద్వారా 68,703 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 589.80 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 312.04 50 టీఎంసీలు కాగా, 311.4474 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది.