రేగొండ/చిట్యాల, ఆగస్టు 3 : విద్యుదాఘాతంతో వేర్వేరు చోట్ల ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నాయి. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లికి చెందిన రైతు పంచగిరి రమేశ్ (35) వరి నాటు వేసేందుకు ఇనుప గొర్రును భజం పై వేసుకొని వెళ్తున్నాడు. సమ్మయ్యకుంట కట్టపై వేలాడుతున్న కరెంటు వైర్లకు ఇనుప గొర్రు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు.
ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యం వల్లే రమేశ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు పరకాల- భూపాలపల్లి జాతీయ రహదారిపై మృతదేహంతో ఆందోళనకు దిగారు. సీఐ మల్లేశ్‌యాదవ్, ఎస్సై రవికుమార్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా చిట్యాల మండలం ముచినిపర్తి శివారులోని గుంటూరుపల్లికి చెందిన మోర్తల లక్ష్మారెడ్డి(35) తన పొలంలో వరి నారుకు నీరు పెట్టేందుకు మోటర్ ఆన్‌చేస్తుండగా, ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో అక్కడిక్కడే మృతి చెందాడు.