నిజామాబాద్ : జిల్లాలోని మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. మహారాష్ట్రలోని పుణెలో నివాసముంటున్న అబ్దుల్ బారి వేసవి సెలవుల్లో నిర్మల్లోని పెద్దమ్మ ఇంటికి వచ్చాడు.
బుధవారం పెద్ద నాన్న ఫహీమ్, తమ్ముడుతో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు రాగా ప్రాజెక్టు ఎస్కేప్, వరద గేట్ వద్ద సెల్ఫీ(Selfie )లు దిగుతుండగా ప్రమాదవశాత్తు అబ్దుల్ బారి నీటిలో పడ్డాడు. అతడిని కాపాడబోయిన పెద్దనాన్న ఫహీమ్ కూడా జారిపడి మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను వెలికితీసి నిర్మల్(Nirmal) ఆసుపత్రికి తరలించినట్లు మెండోరా పోలీసులు(Police ) తెలిపారు.