గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల (Itikyal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బిచుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ బైకును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందాడని, తీవ్రంగా గాయపడిన మరొకరిని దవాఖానకు తరలిస్తుండగా మరణించారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.
మరో ఘటనలో సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం మామిడిపల్లి వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని వాహనం ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు దవాఖానకు తరలించారు.