పాలకుర్తి: పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన మామిడాల రాజయ్యకు చెందిన వ్యవసాయ బావిలో సిమెంట్ గాజులు వేస్తూండగా బావి దరి కూలి ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి కి చెందిన రేషావేణి రాజయ్య, జయ్యారం గ్రామానికి చెందిన మామిడాల రాజయ్యకు చెందిన బావి గాజులు పోసేందుకు కాంట్రాక్టు తీసుకుని పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం కాంట్రాక్టర్ రేషవేణి రాజయ్య, జూలపల్లి మండలం వడ్కాపూర్ కు చెందిన కూలీ భీమోజు అంజయ్య, మరోకులీ సాగర్ లు బావిలో సిమెంట్ గాజులు పొసే పనిలో ఉన్నారు.
ఒక్కసారిగా గాజులకు సపోర్టుగా పోసిన మట్టి దరి బావిలో కూలింది. దీంతో రేషనవేణి రాజయ్య, భీమోజు అంజయ్య అక్కడికక్కడే మృతి చెందారు. సాగర్ కు తీవ్ర గాయలు కాగా పెద్దపల్లికి తరలించారు. పోలీసులు సంఘటస్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసేందుకు బావిలో మోటర్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.