TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూరా్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ ఆయా జిల్లాలకు రెండురోజులు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని వివరించింది.