హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): పసుపు రైతుల కోసం జాతీయ సహకార ఎగుమతి లిమిటెడ్ (ఎన్సీఈఎల్), జాతీయ సహకార ఆర్గానిక్స్ లిమిటెడ్(ఎన్సీవోఎల్)ను నిజామాబాద్లో స్థాపించాలని కేంద్రం నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
ఈ సహకార సంస్థలు పసుపు దిగుమతులను పెంపొందించడంలో, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో, రైతులకు న్యా యమైన లాభాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.